బీఆర్ఎస్వీ నేతలపై అక్రమ కేసులు
విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి, రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థి నేతలపై పోలీసు వాహనం డ్యామేజ్ అయిందన్న నెపంతో సైఫాబాద్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
సిటీ బ్యూరో/ ఖైరతాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్వీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి, రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థి నేతలపై పోలీసు వాహనం డ్యామేజ్ అయిందన్న నెపంతో సైఫాబాద్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఆ నోటీసులు తీసుకోవడానికి శనివారం బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీష్‌తోపాటు పలువురు విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. నోటీసులు తీసుకుని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండంతో అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు హుకూం జారీ చేశారు. వెళ్తామని చెప్తున్నా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగారు.
ఈసందర్భంగా పడాల సతీష్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా విద్యార్థుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుa జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు శ్రీనునాయక్, నిఖిల్ పటేల్, కృష్ణ, సుందర్, కిరణ్, మిథున్, నర్సింగ్, అవినాష్, నాగేందర్, విశాల్, రాకేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

