గోల్నాక ,మార్చి 3: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రంజాన్ నెల ప్రారంభోత్సవ సందర్భంగా అంబర్‌పేట డివిజన్ హైమద్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోసిన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉండటంతో ముస్లిం సోదర సోదరీమణులందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాస దీక్షలో పాల్గొనాలని సూచించారు. రంజాన్ నెల ప్రారంభోత్సవం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, మోసిన్, తదితరులు పాల్గొన్నారు.
iftar