Former Sarpanches | పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని.. సోమవారం సర్పంచుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు చేరుకున్న మాజీ సర్పంచులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో గ్రామాల నుంచి నగరానికి వచ్చిన మాజీ సర్పంచులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, కౌన్సిల్ ప్రతిపక్ష నేత మధుసూదన చారితోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు వెళ్లి అండగా నిలిచారు. వారిని విడుదల చేసేంత వరకు అక్కడే బైఠాయించి మద్దతు తెలిపారు.