KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారన్నారని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం లోక్ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభ పక్షం గవర్నర్‌తో సమావేశమైంది.
అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు ORR పరిధిలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్న వివరాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయం పై మా ఉప నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితే ఎదురుదాడి చేశారు.
అక్రమ మైనింగ్‌పై CBCIDవిచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరంగా ఉంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇక్కడేమో హౌస్ కమిటీలకు విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంత వరకు సబబు. CBCID రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విభాగం , మంత్రి పై విచారణ నిష్పక్షపాతంగా జరగదు. మంత్రి వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశాము. ఇదే విషయంపై ఈరోజు మండలిలో మా ఎమ్మెల్సీలు నిలదీస్తే వారిని సస్పెండ్ చేశారన్నారు.
ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా..? ప్రజలకు ఎవరు దిక్కు.. అని కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టు జడ్జితో విచారణ చేయించమని గవర్నర్‌కు చెప్పాం. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. ప్రజా సంపద దోపిడీ అడ్డుకోవాలని గవర్నర్ కు వివరించాం. నిన్న అసెంబ్లీలో బీజేపీ వ్యవహారశైలి శోచనీయం. ప్రజా దోపిడీని ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతాం. రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. రైట్ టూ ఇన్ఫర్మేషన్ను , రూట్ టూ ఇన్ కమ్గా రేవంత్ రెడ్డి మార్చుకున్నాడు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదు. 14 అంశాల పై విచారణ చెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశాము. వాటి పై విచారణ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా