Harish Rao | రాష్ట్ర ప్రజలకు ఒకటి స్పష్టంగా అర్థమైంది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ పాల్పడ్డాడని.. ఇదే విషయం ఈరోజు టీవీల్లో చూసిన ప్రజలతో పాటుగా రేవంత్ రెడ్డికి ఇంకా అర్థమైంది. స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పాడు రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతికి పాల్పడిందని.. అందుకే ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయి, రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశాడని మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.
అక్రమ మైనింగ్ పై మాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా, వాళ్లకు వాళ్లే CBCID విచారణ అంటూ చెప్పుకొని వస్తున్నారు. అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేస్తే, దళితులపై రాజకీయం చేశారు. ప్రభుత్వ అవినీతినీ కౌశిక్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టే కౌశిక్ రెడ్డిపై ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం దాడి చేస్తుంది.ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా మేము భావిస్తున్నాము. బడువ అనే భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిపై శాసన సభ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కుట్రలో భాగంగా కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారన్నారు.
అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేస్తే తప్పేంటి…
దళితుల పై ప్రేమ ఉన్నది బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు దళిత గిరిజనుల గురించి ఆలోచింది కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారని హరీష్ రావు అన్నారు. ఒక్క ఏడాదికి కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల కోసం రూ.1395 కోట్లు కేటాయిస్తే బిఆర్ఎస్ హయంలో ఒక్క ఏడాదికి దళితుల సంక్షేమం కోసం రూ.7,365 కోట్లు ఖర్చు చేశాము. కాంగ్రెస్ కు దళితుల పై ప్రేమ మాటల్లో ఉంటే, మాకు చేతల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో SC కార్పొరేషన్ కు రూ.3,267 కోట్లు కేటాయించి ,28 కోట్లు ఖర్చు చేశారు.
దళితులపై రేవంత్ రెడ్డిది కపట ప్రేమ, ముసలి కన్నీరు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతికి పాల్పడింది అని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే CBCID విచారణ న్యాయంగా జరుగుతుందా. అందుకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినీ బర్తరఫ్ చెయ్యాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా CBCID విచారణ వేశారన్నారు. మరో వంద అబద్ధాలు ప్రభుత్వం బయట పెట్టుకున్న ప్రభుత్వం.. పార్లమెంట్లో జాయింట్ హౌస్ కమిటీ వెయ్యాలని అనేక సార్లు పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడాడు. రాహుల్ గాంధీ మాట్లాడితే తప్పు లేదుగానీ, మేము హౌస్ కమిటీ డిమాండ్ చేస్తే తప్పా.
ఓబుళాపురం మైనింగ్ పై హౌస్ కమిటీ వేశారు కదా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేస్తే తప్పేంటి. అక్రమ మైనింగ్ అని మైనింగ్ వారే రెండు సార్లు 28 లక్షలు ఫైన్ వేశారు. ఫైన్ కట్టారా లేదా, ఆధారాలు చూయించండని అడిగారు. మంత్రిపై యాక్షన్ తీసుకోలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినీ కాపాడబోయి.. మరో వంద అబద్ధాలు ప్రభుత్వం బయట పెట్టుకుంది. మీటర్లు దొరకడం లేదని, డీజిల్ జనరేటర్స్ ఇచ్చామని మైనింగ్ మంత్రి అంటున్నారు. CSO, CFO సబ్మిట్ చేసిన వారికి మీటర్ల అనుమతి ఇచ్చినప్పుడు , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కంపెనీకి డీజిల్ జనరేటర్స్ ఎలా ఇచ్చారు. దిన్ని బట్టి చూస్తే CSO, CFO మంత్రి సబ్మిట్ చెయ్యలేదని అర్దమవుతుంది. అందుకే అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేశాము.
అక్రమ మైనింగ్‌లో వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది.పరిశ్రమల శాఖలో భాగంగా మైనింగ్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియకపోవడం శోచనీయమన్నారు హరీష్ రావు. అక్రమ మైనింగ్ జరుగుతుందని రాఘవ కన్స్ట్రక్షన్పై అనేక సార్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయం బయటపడగానే నాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. నా బావమరిది, నా తమ్ముడు పేర్లు తీసుకుంటూ మాపై ఆరోపణలు చేశారు.మా కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధం.రేవంత్ రెడ్డి తమ్ముళ్లు, బావలు చేసిన కుంభకోణాలపై విచారణకు రెడీ అయితే నేను రెడీ.CB CID విచారణ కాదుహై కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయుద్దాం, నేను సిద్ధంగా ఉన్నాను, రేవంత్ రెడ్డి సిద్ధమా. .? చెంచా గాల్లాతో నన్ను తిట్టించడం కాదు, రేవంత్ రెడ్డి.నా స్వంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నేను ఫోన్ చెయ్యలేదు.
కాంగ్రెస్ వచ్చాక అనేక స్కాంలు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభకోణాలు జరిగాయని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు లేఖ రాశామని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 20 కుంభకోణాలు జరిగాయి. దమ్ముంటే వీటిపై విచారణ చేయ్ రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డి చేసిన కుంభకోణాల పై విచారణ చేసేదాక బిఆర్ఎస్ వదిలిపెట్టదని హెచ్చరించారు.రాష్ట్రంలో భూముల సెటిల్ మెంట్లో రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాటా బంధాలు ఉన్నాయి.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హౌస్ కమిటీ వేసే దైర్యం రేవంత్ రెడ్డికి లేదు.కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు. సెటిల్ మెంట్ అయితే క్లియర్ చేస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ కుంభకోణం ఆధారాలతో సహా తొందరలోనే బయట పెడుతాను.కొడంగల్ , నారాయణ పేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే ఇచ్చారు.మూసి సుందరీకరణ టెండర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే ఇస్తున్నారు.అందుకే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధం ఫెవికల్ బంధం.రాజేంద్ర నగర్ మానస హిల్స్ ఇష్టానుసారంగా వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారుఇంతటి అవినీతికి పాల్పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చెయ్యాలి, లేదంటే భర్తరఫ్ చెయ్యాలి.CB CID రేవంత్ రెడ్డి జేబుసంస్థ అని ఆరోపించారు.
ఏ తప్పు చేయకపోతే మంత్రి పొంగులేటి ఎందుకంత భయపడుతున్నాడు?
అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీని మూసివేయాలని 8 నెలల కిందటే పొల్యూషన్ బోర్డుకు మైనింగ్ శాఖ ఉత్తరం రాసింది.
8 నెలల నుండి చర్యలు తీసుకోకుండా
ఈ కాంగ్రెస్ దొంగలు… pic.twitter.com/97ktos1efy— BRS Party (@BRSparty) March 29, 2026