సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని సీసీ టీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి అడ్వాన్స్డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్(ఏఎస్ఎస్టీపీ) అనే నూతన వ్యవస్థకు హైదరాబాద్ సిటీ పోలీస్ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల నిర్వహణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను గురువారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో సీపీ సజ్జనార్ ప్రారంభించారు. లోగోను ఆవిష్కరించిన అనంతరం ప్రత్యేక బృందాలకు క్రేన్లు, వాహనాలు ఇతర సామగ్రిని సమకూర్చారు.
ఈ బృందా లకు ఎంపవరింగ్ ఎవ్రీడే సేఫ్టీ టీమ్స్(EYES) పేరు పెట్టినట్లు సీపీ చెప్పారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, మరమ్మత్తులు వస్తే వెంటనే చేయ డం, కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తూ నిరంతరం పనిచేసేలా చూడడం వారి బాధ్యతలుగా సీపీ తెలిపారు. నగరంలో ప్రస్తుతం 16వేలకు పైగా వీధి సీసీటీవీ కెమెరాలు హైదరాబాద్ సిటీ ఆధ్వర్యంలో ఉండగా.. 50వేలకు పైగా కమ్యూనిటీ, ప్రైవేట్ ఫీడ్లు కొనసాగుతున్నాయి. మరో లక్షకుపైగా నేను సైతం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వీటికి అదనంగా బాడీవోర్న్ కెమెరాలు, త్వరలో ప్రవేశపెట్టబోయే పోలీస్డ్రోన్లు వంటి ఆధునిక పరికరాలు కూడా ఈ నెట్వర్క్ లో భాగమవుతాయని ఈ నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సజ్జనార్ అన్నారు.
ఐస్ ఫీల్డ్ బృందాలు ప్రతీజోన్కు రెండు ఉంటాయని, లోపం గుర్తించిన వెంటనే రిపేర్ చేస్తామని, స్టోర్స్టీమ్, రిపేర్ సెంటర్, సీఎస్ఆర్డెస్క్, డేటా అనలిటిక్స్టీమ్ వంటి వి భాగాలతో ఐస్ ఆవిష్కరణ నగరభద్రతలో మైలురాయి గా నిలుస్తుందని సజ్జనార్ చెప్పారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలను అందించాలని పిలుపునిచ్చారు. సీఎస్ఆర్లో భాగంగా క్రిస్టియన్ లీడర్స్ ఫోరమ్ ఇచ్చిన రూ.4లక్షల చెక్‌ను సజ్జనార్‌కు సెంట్రల్‌జోన్ డీసీపీ శి ల్పవల్లి అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ శ్రీనివాసులు, డీసీపీ లు అపూర్వారావు, శ్వేత, రక్షితకృష్ణమూర్తి, రశ్మీపెరుమాల్, రూపేశ్, కిరణ్ప్ర భాకర్, బాలస్వామి, చంద్రమోహన్, సీహెచ్ శ్రీనివాస్, అరవింద్‌బాబు, లావణ్యనాయక్, తదితరులు పాల్గొన్నారు.