Bandari Lakhsma Reddy | రామంతాపూర్, జూన్ 1: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ రామంతపూర్ డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మ్యాట్రిక్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి స్మారక ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మానవుడు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని సాధించగలడని తెలిపారు. ప్రతి మనిషి మంచి ఆహారం తీసుకొని వాకింగ్, ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.