Jagadish Reddy | హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ హైడ్రా ఆ పక్కకు చూడట్లేదని తెలిపారు. కేవలం పేదవాళ్ల ఇళ్ల మీదనే హైడ్రా ప్రతాపం అంతా చూపిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ గాజులరామారంలో హైడ్రా కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాల స్థలాన్ని జగదీశ్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లు కనిపించేవని అన్నారు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి హైడ్రాతో కూలగొట్టిన పేదల ఇండ్ల శిథిలాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గాజులరామారంలో 11 ఎకరాలు కబ్జా చేస్తే.. అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చర్యలు తీసుకోకపోగా.. పోలీసులతో ఆ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రత కల్పిస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీహిల్స్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే పెన్షన్లు, ఫ్రీ బస్సు, రేషన్ ఉండదని పేదవాళ్లను భయపెడుతున్నాడని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. అవన్నీ ప్రభుత్వ పథకాలు అని.. వాటిని ఆపడానికి.. అవేమీ నీ అబ్బ సొత్తు కాదని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని అన్నారు. నిన్ను తరిమికొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నువ్వు నల్లమల పులివి కాదు.. పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్న పిల్లివి అని ఎద్దేవా చేశారు.
గాజులరామారంలో హైడ్రా కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని ,పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాల ను పరిశీలించి మీడియా తో మాట్లాడం జరిగింది
హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ ఏజెన్సీ లా పని చేస్తుంది, ఒక పక్కన మూసి ఒడ్డున పెద్ద… pic.twitter.com/8MfSNOL6V6
— Jagadish Reddy G (@jagadishBRS) November 2, 2025