హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి (HYDRAA Demolitions) బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూమిలో సుమారు 300 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించారని, 60 నుంచి 70 గజాల్లో ప్లాట్లుగా చేసి రూ.10 లక్షల చొప్పున అమ్ముతున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది.
దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శనివారం పర్యటించారు. ఆక్రమణదారుల చేతుల్లో రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. స్థానికులు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, హైడ్రా సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. ఆందోళనల నడుమే కూల్చివేతలు కొనసాగుతున్నాయి.