AV Ranganath | అంబర్‌పేట, ఏప్రిల్ 23: వచ్చే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందని తెలిపారు.
హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను ఏవీ రంగనాథ్ బుధవారం సందర్శించారు. స్థానికుల సమక్షంలో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యుద్ధప్రాతిపదికన బతుకమ్మ కుంట పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయని అన్నారు పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. కాగా, అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని హైడ్రా కమిషనర్‌కు స్థానికులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.