Hydraa | శేరిలింగంపల్లి, మే 28: వరద ముంపు ప్రాంతాల్లో కాలువలు, నీరు నిలిచే ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.
గోపి చెరువు, చాకలి చెరువుల నుంచి వచ్చే వరదతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో ఇబ్బంది ఏర్పడుతోందని జీహెచ్ఏంసీ అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వివరించారు. బాక్స్ డ్రైయిన్ పనులు విస్తరించడంతో ఈ ఏడాది కొంత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.