మాదాపూర్, ఫిబ్రవరి 12: మాదాపూర్‌లోని ఖానామెట్‌లో హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. ఏండ్ల తరబడిగా నివాసముంటున్న ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సమీపంలో అర్థనారీశ్వరస్వామి ఆలయం ఉండటంతో పూజా సామగ్రి, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. ఆ భూ ములపై గతంలోనూ వివాదం ఏర్పడగా కోర్టు నుంచి స్టేటస్కో కూడా తెచ్చు కున్నామని చెప్పిన పట్టించుకోకుండా ఎక్కడికక్కడ కూల్చేశారు. దీంతో బాధితులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగి ఆ ప్రాంతంలో గురువారం ఉద్రికత్త పరిస్థితు లు ఏర్పడ్డాయి. కూల్చివేతలకు నిరసనగా దుకాణాల యజమానులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు జేసీబీల ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయ త్నించిన బాధితులను పోలీసులు ఈడ్చి పడేశారు. ఖానామెట్ సర్వే నెంబర్ 55లో 11 ఎకరాల్లో అర్థనారీశ్వరస్వామి ఆలయం పరిసరాల్లో కొంతమంది దుకాణాలు నిర్వహిస్తున్నారు. వారి వద్ద భూములకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. గుడి పూజారులు, ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ యాదవ్‌తో పాటు స్థానిక వ్యాపారు లు అడ్డుకున్నారు. బాధితులు 1961లో 9జీ పట్టా కింద కొనుగోలు చేశామని చెప్తున్నారు.తమ దగ్గర పన్నుల రశీదులు, పట్టా కాగితాలు కూడా ఉన్నాయన్నారు.
9 జీ కింద పట్టా కొనుగోలు చేశాం..
1961లో మా తాత సందయ్య పేరుతో 9జీ కింద కొనుగోలు చేశాం. 2010లో నా పేరు పైన మ్యూటేషన్ కూడా చేశారు. ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి ప్రభుత్వ భూమి అంటూ ఏండ్లుగా మా పేరిట ఉన్న భూమిని దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. కొన్ని రోజుల క్రితం తులసీ రాం అనే వ్యక్తి చెరువుకు దారి కావాలని ఫిర్యాదు చేయడంతో కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నాం. చెరువు విసీర్ణం 6 ఎకరాల్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేయడం బాధాకరం. – మహిపాల్ యాదవ్,బాధితుడు