Accident | మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌కు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
జబల్పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయడంతో వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన ఇద్దరికి సరైన అందించాలని సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి ఫోన్లో పరామర్శించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు.