Heart Attack | బన్సీలాల్ పేట్, జూన్ 7 : గుండెల్లో నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు.. ఈసీజీ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బన్సీలాల్‌పేట డివిజన్లోని చాచా నెహ్రూనగర్‌కు చెందిన నందికిశోర్ ముదిరాజ్(38) ఛాతిలో నొప్పి రావడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి కార్డియాలజీ వైద్యునికి చూపించుకున్నాడు. అయితే నందకిశోర్ ఆరోగ్యంపై అనుమానంతో ఈసీజీ తీసుకురావాలని వైద్యుడు సూచించారు. డాక్టర్ సూచన మేరకు ఈసీజీ రిపోర్టు తీసుకుని డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి క్యూలో చాలామంది ఉన్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన నందకిశోర్ తల్లి, భార్య, తమ్ముడు.. ఛాతినొప్పి ఎక్కువ కావడం గమనించారు. దీంతో పరిస్థితి విషమంగా ఉందని, డాక్టర్ దగ్గరకు తొందరగా పంపించాలని అక్కడి సిబ్బందిని వేడుకున్నారు. కానీ సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో డాక్టర్‌ను సంప్రదించేలోపే గుండెపోటుతో క్యూలైన్లోనే కుప్పకూలాడు. దీంతో వెంటనే డాక్టర్ వచ్చి పరిశీలించి నందకిశోర్ మరణించాడని తెలిపారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతున్న నందకిశోర్‌ను సమయానికి పరీక్షించి, వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందించి ఉంటే.. అతను జీవించి ఉండేవాడని అతని తల్లి తెలిపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని ఆవేదన చెందింది. తన కుమారుడి మరణానికి గాంధీ ఆస్పత్రి వైద్యులే బాధ్యత వహించాలని పేర్కొంది.
వైద్యులు సకాలంలో పట్టించుకోకపోవడం వల్ల యువకుడు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బన్సీలాల్ పేట్ డివిజన్ లోని చాచానెహ్రూ నగర్ కు చెందిన జే. నంద కిషోర్ ముదిరాజ్ (38) శుక్రవారం చాతిలో నొప్పి రావడంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఓపి చిట్టి తీసుకున్నాడు. కార్డియాలజీ వైద్యుడు అతనికి ఈసీజీ తీసుకొని రమ్మని చెప్పాడు. ఈసీజీ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని తిరిగి డాక్టర్ వద్దకు వచ్చేసరికి క్యూలో చాలా మంది వేచి ఉన్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన నందకిషోర్ తల్లి, భార్య, తమ్ముడు, అతడికి ఛాతి నొప్పి ఎక్కువ కావడం గమనించారు. డాక్టర్ ను సంప్రదించే లోపే క్యూ లైన్ లోనే నందకిషోర్ పడిపోయి ప్రాణాలు వదిలాడు. వెంటనే డాక్టర్ వచ్చి చూడగా అప్పటికి అతను మృతి చెందాడని చెప్పారు.
తీవ్రమైన గుండె నొప్పితో వచ్చిన యువకుడిని ముందుగా పరిశీలించి వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందించి ఉంటే, అతడు జీవించేవాడని, వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంవల్ల తమ కుమారుడు మృతి చెందాడని, దీనికి గాంధీ దావాఖాన వైద్యులు బాధ్యత వహించాలని మృతుడి తల్లి ఆరోపించారు.