బంజారాహిల్స్, మే 27: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో విషాదం నెలకొంది. మద్యానికి బానిసైన ఓ మహిళ.. ఆ అలవాటు మానుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం.5లోని దుర్గాభవానీ నగర్ బస్తీకి చెందిన ముదావత్ మాల్యా, ముదావత్ బుజ్జీ(33) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. కొంతకాలంగా బుజ్జీ కల్లుతో పాటు మదయానికి బానిసైంది. కొంతకాలంగా తరచూ మద్యం సేవిస్తూ కుటుంబసభ్యులను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు జరిగాయి. తాగుడు అలవాటు మానుకోవాలని కుటుంబసభ్యులు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి మద్యానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనోవేదనకు గురైన బుజ్జి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు జానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేరకు ఆమె సోదరుడు జానీ జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.