Traffic Challans | హైదరాబాద్ : ట్రాఫిక్ చలాన్లపై రాయితీ వార్తలను ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు రాయితీ ప్రకటించారని సోషల్ మీడియా వస్తున్న వార్తలపై ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ స్పందించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. echallan.tspolice.gov.in అనే వెబ్సైట్లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన సూచించారు. పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెలలో భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు కొనసాగిన ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది.
ఇవి కూడా చదవండి..
Keshava Chandra Ramavath | ఓటీటీలోకి రాబోతున్న ‘కేసీఆర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Harshal Kumar: ముంబైలో 13వేల జీతగాడు.. కానీ గర్ల్ఫ్రెండ్కు 4బీహెచ్కే ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాడు
CM Revanth Reddy Flexi | సీఎం రేవంత్ ఫ్లెక్సీలు తీస్తుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి