సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అల్పపీడనం ప్రభావంతో శనివారం గ్రేటర్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9.30గంటల వరకు మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్‌లో అత్యధికంగా 3.23 సెం. మీలు, ఘట్కేసర్లోని ఘన్‌పూర్‌లో 2.28 సెం.మీలు, సింగపూర్ టౌన్షిప్, తొర్రూర్‌లో 1.0సెం.మీలు, పెద్ద అంబర్పేట్, హస్తినాపురంలో 5.8సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు వర్షం కు రియనున్నట్లు తెలిపారు.