Hyderabad | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బహదూర్‌పురాలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగుర్ని నార్కొటిక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు.
అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడిని సయ్యద్ ఫైసల్‌గా నార్కొటిక్ పోలీసులు గుర్తించారు. అతనిపై గతంలో పలు డ్రగ్స్ కేసులు కూడా నమోదైనట్లుగా తెలిసింది. సయ్యద్ ఫైసల్ నుంచి డ్రగ్స్ కొంటున్న 19 మంది కస్టమర్లను కూడా గుర్తించారు.