గాంధీకి గట్టి భద్రత
గాంధీ దవాఖానకు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. నిత్యం వందలాది మంది వచ్చే గాంధీకి భద్రత పెంచాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
- సెక్యూరిటీ, పారిశుధ్యం నిర్వహణపై ప్రభుత్వం దృష్టి
- 170 మంది సెక్యూరిటీ, 280 మంది పారిశుధ్య సిబ్బందితో నిర్వహణ
- 200 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 12 : గాంధీ దవాఖానకు ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. నిత్యం వందలాది మంది వచ్చే గాంధీకి భద్రత పెంచాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం టెండర్ గడువు దాటిన సంస్థకు కాకుండా గత ఐదు నెలల కిందట జీడీఎక్స్ ఫెసిలిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే సంస్థకు నిర్వహణ, సెక్యూరిటీ బాధ్యతలను అప్పగించింది. అంతకు ముందు కేవలం 86 మంది సెక్యూరిటీ ఉండగా.. ప్రస్తుతం 170 మందికి, పారిశుధ్యం నిర్వహణకు గతంలో 170 మంది ఉండగా, ప్రస్తుతం 280 మందికి పెంచింది. దాంతో పారిశుధ్యంతోపాటు భద్రత కట్టుదిట్టంగా అమలవుతున్నది. వార్డుల్లో సైతం నిఘా పెంచి, సెల్ఫోన్లను అపహరిస్తున్న పలువురు దొంగలను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.
మరిచిపోయిన వస్తువులు అందజేత..
సోమవారం తన స్కూటర్‌కు తాళాలు మరిచిపోయిన మహిళా డాక్టర్‌కు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఆమెకు అందజేశారని జీడీఎక్స్ సంస్థ మేనేజర్ రవికుమార్, చీఫ్ సెక్యూరిటీ అధికారి శివాజీ, శానిటరీ సూపర్వైజర్ బాబూరావు తెలిపారు. అలాగే ఇటీవల తన విలువైన ల్యాప్‌టాప్ పోగొట్టుకొన్న మరో వైద్యుడికి దానిని సురక్షితంగా అందజేశామన్నారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో 200కు పైగా సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో అన్ని మార్గాలు, వార్డులు, అత్యవసర విభాగాలు నిఘాలో ఉన్నాయని వారు చెప్పారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, బందోబస్తు పటిష్టంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సెల్లార్, వార్డుల్లో, డైట్ క్యాంటీన్లో ప్రమాదకరంగా మారిన ఎలుకలను కూడా నియంత్రించామని చెప్పారు.
సెక్యూరిటీ చేపట్టిన తాజా చర్యలు
- అంబులెన్స్‌లు అత్యవసర విభాగం వద్దకు వెళ్లేందుకు మార్గాన్ని సులభతరం చేశారు.
- రోగుల బంధువులు ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయవద్దని, పరిశుభ్రతకు సహకరించాలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు.
- ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని, దవాఖానలో అన్ని సేవలు పూర్తిగా ఉచితమేనని ప్రచారం చేస్తున్నారు.
- బయటి రోగుల (ఓపీ) విభాగం వద్ద వాహనాల పార్కింగ్‌ను క్రమపద్ధతిలో ఏర్పాటు చేశారు.
- దవాఖానలోకి వెళ్లే రోగి బంధువులను ఒక్కొక్కరిని చెకింగ్ చేసి మద్యం, గుట్కా, సిగరెట్లను చెత్తబుట్టలో పారేస్తున్నారు.
- అన్ని ఫ్లోర్లలో ఎక్కడా చెత్త లేకుండా ఆధునిక యంత్రాలతో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.
- షెడ్లలో కేవలం రోగి బంధువులే ఉండాలని, విచారణ జరిపి బయటి వ్యక్తులను తరలిస్తున్నారు.
- ప్రతిరోజు సూపర్వైజర్లు, షిఫ్టుల వారీగా విధుల్లోకి వచ్చే సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.
- ఔట్‌పోస్ట్‌లో ఉండే చిలుకలగూడ పోలీసులతో సమన్వయంగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

