Metro rail services : వినాయకుడి నిమజ్జనాల (Ganapati Immertions) నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro rail) సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న పెద్ద ఎత్తున గణపతి నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుపాలని నిర్ణయించింది. ఆ మేరకు ఒక ప్రకటన చేసింది.
మెట్రో లైన్లలోని ప్రతి స్టార్టింగ్ స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుందని తెలిపింది. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు కూడా నడిపిస్తామని మెట్రో రైల్ సంస్థ స్పష్టం చేసింది.