Hyderabad Metro | హైదరాబాద్లో మెట్రో సేవలు స్తంభించాయి. సాంకేతిక కారణాలతో నాగోలు-రాయదుర్గం రూట్లోని మెట్రో సేవలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ, నాగోలు నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి.
ప్రస్తుతం నాగోలుకు బదులుగా తార్నాక నుంచే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. సాంకేతిక కారణాలతో ఆయా మార్గాల్లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూర్తిస్థాయిలో మెట్రో రైళ్ల పునరుద్ధరణకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఉదయం సమయం కావడంతో ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు రద్దీగా ఉన్నాయి. ఇదే సమయంలో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad Metro Services are delayed by more than 20 mins.
Reason unknown. But there are slow moving trains on Red line and no trains at all on the Nagole to Raidurg line.@ltmhyd#hyderabad #Metro #delays pic.twitter.com/CVXHuLHrUg
— Shiva Charan (@ShivaCharan94) January 29, 2025