సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): గ్రేటర్ వాతావరణం మరోసారి వేడెక్కింది. ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కొంత చల్లబడిన నగర వాతావరణం పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో మళ్లీ వేడెక్కింది.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26.8 డిగ్రీలు, గాలిలో తేమ 38 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.