సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కాగా, అల్పపీడనం కారణంగా గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం నగరంలో గరిష్ఠం 40.2 సెల్సియస్‌గా నమోదవ్వగా, సోమవారానికి 2.4 తగ్గి 37.8 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ఠం 27.0 డిగ్రీల సెల్సియస్‌గా, గాలిలో తేమ 46 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.