Weather Update | సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండలు కూడా దంచికొడుతున్నాయి. అయితే నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం మాన్సూన్ వీక్‌గా ఉండటం, రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించకపోవడమేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి స్పష్టం చేశారు. వచ్చే వారంలో మోస్తరు నుంచి భారీ, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు.