Manikonda | మణికొండ, ఏప్రిల్ 22: ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీతారాం ధూళిపాళ అన్నారు. గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మంగళవారం సెక్రటేరియట్ కాలనీలో పర్యటించి పర్జల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా ఎల్టి విద్యుత్ వైర్లు చేతికందే విధంగా వేలాడుతున్నాయని, దీనివల్ల ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఎంతైనా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైర్లపై రోజూ ఊర పిచ్చుకలు చనిపోతున్నాయని.. ప్రజలకు సైతం ఇవి ఎంతో ప్రమాదకరంగా మారాయని చెప్పారు. అధికారులకు ఫిర్యాదులు చేసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వీధిదీపాలు సైతం వెలగడం లేదని దీని కారణంగా స్థానిక ప్రాంతాలన్ని అంధకారంలో ఉంటున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కన పెటాలని.. ఆర్సీసీ రోడ్డు వేసేటప్పుడు డ్రైనేజీ లైన్లు కిందికి రోడ్డేమో పైకి వేయడం వల్ల వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధులన్ని చెత్తచెదారాలు, వ్యర్థాలతో నిండిపోతున్నాయని తెలిపారు. తూతూ మంత్రంగా చెత్తను తీసేయడం వల్ల ఇంకా అపరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని వెల్లడిస్తున్నారని అన్నారు. అధికారులు ఈ సమస్యలపై వెంటనే స్పందించి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.