సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హానికరమైన పదార్థాలతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారుచేసి అమ్మకాలు సాగిస్తున్న మహమ్మద్ ఫైజల్‌ను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు.. పటేల్‌నగర్‌లో ఎఫ్కేఫుడ్ ప్రొడక్ట్ పేరుతో అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్న మహ్మద్ఫైజల్ దుకాణంపై దాడులు చేశారు. ఫైజల్ తమ ఉత్పత్తులను వినియోగదారులకు, కిరాణ దుకాణాలకు అమ్ముతున్నారని తెలిపారు.
ఈ పేస్ట్ టైటానియమ్ డైఆక్సైడ్, టర్మరిక్ పౌడర్‌తో కలిపి తయారుచేస్తున్నారని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపారు.
ఈ దాడుల్లో 870 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 కిలోల టైటానియమ్ డైఆక్సైడ్, 16 కిలోల మోనో సైట్రేట్, 4 కిలోల టర్మరిక్ పౌడర్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివరించారు.