Maha Shivaratri | అమీర్‌పేట, ఫిబ్రవరి 24 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన యువతి అద్భుతం సృష్టించారు. రాలిపోయిన రావి ఆకుపై మహాశివుడి ఆకారాన్ని తీర్చిదిద్దారు. సనత్‌నగర్ జెక్ కాలనీకి చెందిన వాణీరెడ్డి చేసిన పరమేశ్వరుడి ఆకృతి ఇప్పుడు వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన వాణి రెడ్డి లీఫ్ కార్వింగ్ ఆర్టిస్ట్. రావి ఆకులను సేకరించి వాటిపై చక్కటి కళాకృతులను ఆవిష్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎండిపోయిన ఆకులపై యోగాసనాలు, వివిధ నృత్య భంగిమలు, ఎర్రకోట మీద జాతీయ పతాకం, సూర్య నమస్కారాలు వంటి అనేక కళాకృతులను సందర్భానుసారంగా తీర్చిదిద్దారు. తాజాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని శివుడు తపస్సు చేస్తున్నట్లుగా ఒక బొమ్మను రావి ఆకుపై తీర్చిదిద్దారు.