Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. గచ్చిబౌలి పరిధిలోని ఓ హాస్టల్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలోకి వెళ్లిన దుర్గా ప్రసాద్.. ఉరేసుకున్నాడు. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు దుర్గాప్రసాద్ది కోనసీమ జిల్లాగా పోలీసులు గుర్తించారు.