తాగునీటి సరఫరాకు అంతరాయం
జీహెచ్ఎంసీ చేపడుతున్న బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్ట్ ఫేజ్-3, రింగ్ మెయిన్-1కి చెందిన 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌పై జంక్షన్ పని చేపట్టనున్నారు
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చేపడుతున్న బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్ట్ ఫేజ్-3, రింగ్ మెయిన్-1కి చెందిన 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌పై జంక్షన్ పని చేపట్టనున్నారు. ప్రతిపాదిత బాక్స్ డ్రెయిన్ అలైన్మెంట్లో ఈ ప్రధాన పైప్ లైన్ ఉండటంతో, డ్రెయిన్ నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు జంక్షన్ పని చేపట్టడం అవసరమైంది. ఈ పనులు శనివారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు చేపట్టనున్నారు.
ఈ 24 గంటలు కృష్ణా ఫేజ్-3, రింగ్ మెయిన్-1 పరిధిలోని కొన్ని రిజర్వాయర్ కమాండింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్‌తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉంది. శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గానగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్ పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్ననగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, షేక్ పేట్ రిజర్వాయర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.ss
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

