చర్లపల్లి, డిసెంబర్ 3:అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ శ్రీ కృష్ణయాదవ సంఘం సభ్యులు ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిని కలిసి మల్లన్న, కృష్ణుడి ఆలయ నిర్మాణం, కమ్యూనీటి హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని యాదవుల సంక్షేమానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను సద్వినియోగం చేసుకోని ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. అదేవిధంగా చర్లపల్లి డివిజన్ యాదవులకు కమ్యూనీటి హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం పలువురు సభ్యులు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు మల్లేశ్‌యాదవ్, కృష్ణయాదవ్, సందీప్‌యాదవ్, వెంకటేశ్‌యాదవ్, అనిల్‌యాదవ్, రమేశ్‌యాదవ్, రవియాదవ్, మహేశ్‌యాదవ్, రాజుయాదవ్, ఎల్లయ్యయాదవ్, జమ్మయ్యయాదవ్, స్వామియాదవ్, శ్రీశైలంయాదవ్, ఐలేశ్యాదవ్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, కుమార్‌స్వామి, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, బేతాల బాల్‌రాజు, శేర్ మణెమ్మ, శిరీషారెడ్డి, మురళిపంతులు, వేముల సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన కామాక్షిపురం కార్యవర్గం
రామంతాపూర్, డిసెంబర్ 3: ‘కామాక్షిపురం వెల్ఫేర్ అసోసియేషన్’ నూతన కార్యవర్గం శనివారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు దుర్గేశ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, కోశాధికారి శ్రీనివాస్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నందికంటిశివ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తిదాయకం
ఉప్పల్, డిసెంబర్ 3: దివ్యాంగులకు నిత్యం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ సమస్యలు అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారీ, ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి, సీఓ వాణి, రిసోర్స్ పర్సన్స్ రామకృష్ణ, నేతలు సాయిజెన్ శేఖర్, గరిక సుధాకర్, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, టౌన్ వికలాంగుల సమాఖ్య సభ్యు లు శేఖర్, హరిబాబు, లక్ష్మి, మక్బూల్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.