మేడ్చల్ జోన్ బృందం, నవంబర్ 23 : దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మంత్రి మల్లారెడ్డిపై చేస్తున్న ఐటీ దాడులను నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతో బీజేపీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. మేడ్చల్ మండల, పట్టణ నాయకులు బోయినిపల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద జరిగిన నిరసనలో వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్ కౌడె మహేశ్పాల్గొన్నారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్డుపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించి మోదీ డౌన్… డౌన్ అంటూ నినాదాలు చేస్తు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి మచ్చలేని మనిషని, క్లీన్ చిట్ వస్తదన్నారు. ఘట్కేసర్లో పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో, పోచారంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కీసర ప్రధాన చౌరస్తాలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్‌లు మాధురి వెంకటేశ్, పెంటయ్య, విమలనాగరాజు పాల్గొన్నారు. అలియాబాద్ చౌరస్తాలో రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేసి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.