మేడ్చల్ రూరల్, ఆగస్టు 22 : ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు అన్నారు. మేడ్చల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను బాలానగర్ డీసీపీ గోనె సందీప్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయని, ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో మేడ్చల్‌లో కొత్త ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అల్వాల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో మేడ్చల్, శామీర్‌పేట మండలాలను విడదీసి, మేడ్చల్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పోలీస్‌స్టేషన్ ద్వారా ట్రాఫిక్ క్రమద్ధీకరణ జరుగుతుందని, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా నర్సింహా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీలు శ్రీనివాస్‌రావు, గోనె సందీప్ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.