దుండిగల్/జీడిమెట్ల, ఆగస్టు 22 : నగరంలోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు దుండిగల్ మున్సిపాలిటీ నుంచి భారీగా తరలివెళ్లారు. మున్సిపాలిటీ నుంచి 8 ఆర్టీసీ బస్సులను మున్సిపల్ చైర్ పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ ప్రారంభించారు.
వెళ్లినవారిలో వైస్‌చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సింగం భరత్‌కుమార్, కోలా సాయిబాబాయాదవ్, అమరం గోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మురళియాదవ్, మేనేజర్ సునంద, రెవెన్యూ ఆఫీసర్ శ్రీహరిరాజు, మున్సిపల్ సిబ్బంది, సీనియర్ సిటిజెన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా కమిటీలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు .
నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 6 బస్సుల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా కమిటీలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తరలి వెళ్లారు. నోటిఫైడ్ ఇండస్ట్రీయల్ ఏరియా సర్వీస్సొసైటీ(ఐలా) ఆధ్వర్యంలో 500 మంది బైక్‌లపై ర్యాలీగా వజ్రోత్సవ వేడుకలకు తరలివెళ్లారు. వెళ్లినవారిలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవి, ఐలా చైర్మన్ సదాశివారెడ్డి, వైస్‌చైర్మన్ ఏఎల్ఎన్ రెడ్డి, కమిషనర్ విజయ, కోశాధికారి క్రిష్ణ, కార్యవర్గ సభ్యులు భాస్కర్‌రాజు, పీడీ రాజు, రాంతిలక్ తదితరులు ఉన్నారు.