మూసాపేట, ఆగస్టు22: కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట డివిజన్ పరిధి అవంతినగర్ తోటలో నూతన భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులకు సోమవారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్, టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్‌తో కలసి శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్ని డివిజన్లను సమపాళ్లలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతికాలనీ, బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
వానకాలాన్ని దృష్టిలో పెట్టకొని ముంపుసమస్య పరిష్కారంలో భాగంగా వరదనీటి కాల్వల పునురుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో జాప్యం లేకుండా త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ శ్రీదేవి, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, నాగుల సత్యం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కాలనీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.