మాదాపూర్, ఆగస్టు 18: ఆధునిక సాంకేతిక ఆధారంగా ఆవిష్కరించిన యంత్ర పరికరాలు, మెషిన్ టూల్స్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా కొలువుదీరాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్స్, ఇంజినీరింగ్ ఎక్స్ పో (హింటెక్స్), ఇండియా ప్రాసెస్ ఎక్స్ పో, కాన్ఫిరెన్స్ (ఐపీఈసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హింటెక్స్ 6వ ఎడిషన్ ఎక్స్ పోను గురువారం ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ కె. శివరామప్రసాద్, ఎఫ్‌టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయదేవ్‌తో కలిసి ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 143 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన జనరేటర్లు, లేత్ మెషనరీలు, సీఎన్జీ కటింగ్ అండ్ మౌల్డింగ్ మెషనరీలు, బ్యాటరీలు, బాయిలర్లు, డ్రిల్లింగ్ మెషనరీలు, ఎనర్జీ మెషనరీ, హైడ్రాలిక్ మెషనరీలు, మెషనరీ టూల్స్‌లను ప్రదర్శించారు. విక్రయదారులు, కొనుగోలుదారులు ఒకే చోట మెషనరీలను సందర్శించి వాటి పనితీరును తెలుసుకోవచ్చు. ఇందులో బీహెచ్ఈఎల్, ఎస్కేఎం టెక్నాలజీస్, ఎంటీఏఆర్, టాటా అడ్వాన్డ్ సిస్టమ్స్, టాటా సికోర్సీ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కావలసిన డిజైన్లలో… సైజుల కటింగ్..
సికింద్రాబాద్‌లోని జీఎంటీ ఇంజినీరింగ్ ప్రై.లిమిటెడ్ వారు రెండు రకాల మెషనరీలను అందిస్తున్నారు. ఇందులో మొదటిది లేజర్ కటింగ్ మెషీన్, రెండోది ఎలక్ట్రో హైడ్రాలిక్ సీఎన్‌జి ప్రెస్ బ్రేక్ మెషనరీ. లేజర్ కటింగ్ మెషీన్‌తో ఏదైనా ఐరన్, మైల్డ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్లను కావలసిన డిజైన్లతో సైజులను చేసేందుకు వినియోగిస్తారు. దీనిని ఇంజినీర్ ప్లాన్ ప్రకారం సిస్టమ్‌లో ప్రోగ్రామింగ్ చేసి మెషిన్‌కు సరిపడా డిజైన్‌తో పాటు ఎంత ఎంఎంతో రంధ్రాలు కావాలో సైజులను సెట్ చేసినట్లయితే అందులోని కటింగ్ హెడ్స్ ఆధారంగా ఫ్రిసిటెక్, రే టూల్స్ సహయంతో మనం ఎంచుకున్న డిజైన్‌లో షీట్లను కట్ చేసి పంపుతుంది. ఇందులో బీఎల్ సిరీస్, జీఎల్ ఎఫ్టీ సిరీస్, జీఎల్ సిరీస్‌లు సీఎన్జీ కటింగ్ మెషీన్ సిరీస్‌లు ఉంటాయి. రెండో రకం ఎలక్ట్రో హైడ్రాలిక్ సీఎన్జీ ప్రెస్ బ్రేక్ మెషనరీతో అనేక రకాలైన షీట్లను ఫార్మింగ్ చేసుకోవచ్చు. మెషనరీలో లేసర్ కటింగ్ మెషిన్‌తో ఏదైనా ఐరన్, మైల్డ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, కాపర్లను ఎన్ని డిగ్రీల కోణంలో మలచాలి… ఎటు వైపు తిప్పాలో సిస్టమ్‌లో ప్రోగ్రామింగ్ చేసినట్లయితే కావలసిన విధంగా షీట్లను మలుచుతుంది.
వివిధ గేజ్‌లతో టూల్స్..
పుణేకు చెందిన ఏటిక్యూ మెట్రో కంపెనీలో కటింగ్ టూల్స్ ఇన్ఫెక్షన్ మెషిన్, ఆటో క్విక్ మెజర్మెంట్ మెషిన్, ప్రొఫైల్ ప్రొజెక్టర్, లేసర్ మార్కింగ్ మెషిన్, డిజిటల్ మ్యాగ్రిఫైర్, మెజరింగ్ మెషిన్స్ వంటి యంత్ర పరికరాల సహయంతో అనేక డిజైన్లు, సైజులతో కూడిన కటింగ్ టూల్స్, మెడికల్ కేర్, గ్యాస్ కిట్, జువెలరీ ఐటెంలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, ఏరో స్పేస్, ఆటోమోటివ్, స్టాంపింగ్, ప్లాస్టిక్ మౌల్డింగ్ అండ్ రబ్బర్లతో పాటు 3సి ప్రోడక్ట్లను తయారు చేస్తుంది. వీటిని కావలసిన డిజైన్‌లో కావలసిన సైజులో తయారు చేసేందుకు ముందుగా సిస్టమ్‌లో ప్రోగ్రామింగ్ చేసి ఉంచినట్లయితే వివిధ ఎంఎంలతో వీటికి కావలసిన టూల్స్‌లను తయారు చేస్తుంది.
ఆప్టికల్ మెసరింగ్ ప్రూవ్..
తార్నాకలోని ఎస్ఎల్ఎస్ ఇంజినీరింగ్ ప్రై. లిమిటెడ్ కంపెనీ వర్క్ పీస్‌లను కావలసిన డైమెన్షన్లో మెజర్ చేసి వాటి ద్వారా తయారైన టూల్స్‌ను మార్కెట్లో విక్రయిస్తుంది. మనం ఏదైనా జాబ్ (వర్క్ పీస్)లను కావలసిన కొలత, డైమెన్షెన్తో చేయాలంటే మెషిన్ చేసినట్లుగా చేయలేం. పైగా వంకర్లు తిరుగుతూ షేప్ ఔట్ అవుతాయి. వర్క్ పీస్‌లను పక్కా డైమెన్షన్‌తో మెజర్ చేస్తూ టూల్‌ను అందించడానికి సీఎన్జీ మెషిన్ డయామీటర్, ఆప్టికల్ మెజరింగ్ ప్రూవ్ సహాయంతో మల్టీ గేజ్‌లను మెజర్మెంట్ చేస్తాయి. వీటి ద్వారా చిన్న టూల్స్ సైతం మనం సిస్టమ్‌లో చేసిన డిజైన్‌తో తయారు చేయడంలో ఉపయోగపడుతాయి.
ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేసేందుకు..
హైదరాబాద్‌లోని జనటిక్స్ న్యూమాటిక్ కంపెనీ ఎయిర్ ఫిల్టర్ రెగులేటర్, న్యూమాటిక్ ఎయిర్ సిలిండర్స్తో పాటు డైరెక్షన్ కంట్రోల్ బాల్స్‌లను తయారు చేస్తుంది. న్యూమాటిక్ ఎయిర్ సిలిండర్ ఏదైనా యంత్ర పరికరాలు, బస్, లారీ, కార్ వంటి తయారీలలో దీన్ని వాడతారు. ఆలాంటి సమయంలో వాటిలో ఏదైనా పార్టికల్స్ చేరి సమస్య వచ్చినప్పుడు దీన్ని ద్వారా మెషినరీలో పేరుకుపోయిన పార్టికల్స్‌ను ఎయిర్ ఫిల్టర్ ద్వారా క్లీన్ చేసేందుకు ఉపయోగించి ఫ్యాబ్రికేటర్ ద్వారా సులువుగా బయటకు పంపివేసేందుకు ఉపయోగపడుతాయి. డైరెక్షన్ కంట్రోల్ బాల్స్ .. న్యూమాటిక్ సిలిండర్స్‌ను కంట్రోల్ చేయడానికి వాడతారు. వీటిని ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్, మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్ అప్లికేషన్లకు చెందిన కంపెనీలు వీటిని వాడుతుంటారు.
కావలసిన డైరెక్షన్లో రంధ్రాలు
మనం ఏదైనా మెషిన్ తయారు చేసే సమయంలో పలు చోట్ల రంధ్రాలను చేయాల్సి వస్తుంది. ఆంగులర్ మెషిన్‌ను సీఎన్జీ మెషిన్‌కు జత చేసి మరో యంత్రానికి లేదంటే ఇతర ఐరన్, కాపర్, స్టెయిన్లెస్ స్టీల్ వంటి షీట్, మోటార్లకు రంధ్రాలను చేయాలంటే దీన్ని ఖచ్చితంగా ఉంటుంది. దీనితో 6 ఎంఎం నుంచి 20 ఎంఎంల పైన రంధ్రాలు చేసేందుకు వాడతారు.
– శ్రీనివాస్, ఎఫ్ఏఆర్ కంపెనీ మేనేజర్
రెగ్యులేటర్ .. ఎయిర్ ఫిల్టర్ కిట్..
ఏదైనా యంత్ర పరికరాల్లో ఎయిర్ ఫిల్టర్, రెగులేటర్లను వాడుతుంటారు. జనటిక్స్ న్యూమానిక్ కంపెనీ న్యూమాటిక్ ఎయిర్ సిలిండర్స్తో పాటు డైరెక్షన్ కంట్రోల్ బాల్స్‌లను తయారు చేసే కంపెనీ. మా వద్ద ఐఎస్వో స్టాండర్ట్ సిలిండర్లు, స్కేర్ సిలిండర్లు, కాంపాక్ట్ వాల్వ్స్, మ్యానువల్, మెకానికల్ వాల్వ్స్, ఎయిర్ ప్రిపరేషన్ యూనిట్, మినియేచర్ సిలిండర్స్లతో పాటు ఎయిర్‌లైన్ వాల్వ్, క్విక్ ఎగ్జాస్ వాల్వ్, క్విక్ కప్లర్స్, జంక్షన్ బాక్స్, డిజిటల్ ప్రెసర్ సెన్సార్, నిపల్స్, వన్ టచ్ ఫిటింగ్, పాలిమీటర్ ట్యూబ్, పాలిమీటర్ కాయిల్ ట్యూబ్, ఎయిర్ ఫిల్టర్ విత్ సర్వీస్ ఇండికేటర్, పిస్టన్ రాడ్, హై ప్సెర్ వాల్వ్, ఫిల్డర్ సర్వీస్ ఇండికేటర్, హై ప్రెజర్ సైలెన్సర్లతో కూడిన పరికరాలను తయారు చేయడం జరుగుతుంది. వీటిని బస్, ట్రక్, కార్, రైల్లలో వాడతారు.
– వి. సాయి వంశీ, జనటిక్స్, న్యూమాటెక్స్ కంపెనీ సేల్స్, కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్