ఎల్బీనగర్, అక్టోబర్ 19 : గడ్డిఅన్నారం డివిజన్లోని పటేల్‌నగర్ ఉమెన్స్ వరల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా పలు నృత్యాలు, ఆట పాటలతో మహిళా మణులు అలరించారు.
ఈ కార్యక్రమం అద్యాంతం ఎంతో ఆనందంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ వరల్డ్ ప్రతినిధులు బి. ఇందిర, సి. సంయుక్త, సి. రాధ, మాధవి, శిరీష, కోరియోగ్రాఫర్ హర్షితతో కలిసి పండుగ శోభను తలపించేరీతిలో సంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డి, సృజన దంపతులు, బీసీ సంఘంనాయకులు గండి జగన్ యాదవ్, రేఖ దంపతులు ముఖ్యఅతిథులుగా హజరయ్యారు.