శామీర్‌పేట, ఆగస్టు 24: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, తెలంగాణలోని 12,700 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం దత్తత మండలం మూడుచింతలపల్లిలోని నాగశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా రూ.3.76 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంటింటికీ తాగునీరు, నిరంతర విద్యుత్ ఇవ్వడమే కాకుండా దేశ చరిత్రలో కనీవిని ఎరగని తరహాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితబంధు వంటి ఎన్నో పథకాలను రూపొందించి ప్రజలకు అందిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.మూడుచింతలపల్లి మండలాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక నిధులతో ఆదర్శ మండలంగా అభివృద్ధి పరుస్తున్నట్లు వివరించారు.
నాగిశెట్టిపల్లిలో రూ.3.76 కోట్లతో అభివృద్ధి చేయడం గొప్ప విషయమన్నారు. మూడుచింతలపల్లి మండలానికి తన సొంత నిధులు మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ద్వారా వైకుంఠరథాన్ని అందించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ హారిక, సర్పంచులు కృపాకర్‌రెడ్డి, జామ్ రవి, విష్ణువర్ధన్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, ఆంజనేయులు, ఇస్తారి, ఎంపీటీసీలు హనుమంత్‌రెడ్డి, నాగరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, ఎంపీడీవో రవినాయక్, ఆర్ఎస్ఎస్ జిల్లా సభ్యుడు విష్ణుగౌడ్, వార్డు సభ్యులు, అధికారులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి చిత్తాగౌడ్, గోపాల్, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మతం ముసుగులో ప్రజల మధ్య మంట పెడుతున్నదని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. శాంతియుత వాతావరణంలో కులమతాలకు అతీతంగా సాగిపోతున్న తెలంగాణ పాలనలో బీజేపీ పంచాయితీలు పెడుతున్నదన్నారు. ప్రజల మధ్య మంట పెడుతున్న బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.