మేడ్చల్ రూరల్ / మేడ్చల్ కలెక్టరేట్ / ఘట్కేసర్ / పీర్జాదిగూడ, ఆగస్టు 22 : నగరంలోని ఎల్బీ స్టేడియంలో సోమవారం జరిగిన వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల ముగింపు కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ సిబ్బంది, నేతలు తరలివెళ్లారు. మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది వెళ్లారు.
నాగారం మున్సిపాలిటీ నుంచి చైర్మన్ చంద్రారెడ్డి 8 బస్సుల్లో వజ్రోత్సవ సభకు వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు ఉన్నారు. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ నుంచి చైర్మన్లు ఎం.పావనీ జంగయ్య యాదవ్, బి.కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు సభకు వెళ్లారు. కమిషనర్లు సురేశ్, వసంత పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ మండల పరిధి.. ప్రతాపసింగారంలోని జడ్పీ పాఠశాలలో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి బహుమతులు అందజేశారు. సర్పంచ్ శివశంకర్, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు తదిత రులు పాల్గొన్నారు.
కీసర : ఫ్రీడమ్ కప్‌లో భాగంగా కీసర పాఠశాలలో కాప్రా, కీసర జోనల్ స్థాయి క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్‌రెడ్డి అందజేసిన బహుమతులను సర్పంచ్ మాధురి వెంకటేశ్, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి కలిసి అందజేశారు. ఆ పాఠశాల చైర్మన్ రాము, వైస్ చైర్మన్ లత, నాయకులు, ప్రధానోపాధ్యాయుడు వి. వెంకటేశ్వర్లు , పీడీ బి.యాదయ్య,పీఈటీలు పాల్గొన్నారు.