సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : నిత్యం జిమ్‌కు వెళ్లాలని అనుకున్నా.. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నదని, ఈ సంవత్సరం ఆ ధోరణికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. విధి నిర్వహణ హడావుడిలో వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రణాళికను 2026లో ఆచరణలో పెట్టడమే తన ప్రధాన వ్యక్తిగత లక్ష్యమని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాదు.. నగర ఆరోగ్యాన్ని కాపాడటం కూడా తన బాధ్యతేనని, ఈ ఏడాది సైబర్ నేరాలపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్, డిజిటల్ మోసాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని సజ్జనార్ హెచ్చరించారు.