CP Sajjanar | హైదరాబాద్ : సైబర్ నేరాల పట్ల మరోసారి ప్రజలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. ముఖం చూసి మోసపోవద్దు.. జాగ్రత్త అని సీపీ హెచ్చరించారు.
వాట్సాప్‌లో డీపీగా తన ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సీపీ పేర్కొన్నారు. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి అని తెలిపారు. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి అని సజ్జనార్ సూచించారు.
సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.