సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న సైబర్నేరాలను అడ్డుకోవడంలో పోలీసులతో పాటు బ్యాంకుల పాత్ర కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం సీనియర్ బ్యాంకు అధికారులు, ఆర్బీఐ ఆఫీసర్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బ్యాంకుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఎదురవుతున్న సమస్యలు, వాటి ని ఎదుర్కొవడానికి చేయాల్సిన పనులు, మున్ముందు సమన్వయంతో పనిసేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్ఓపీ) ఎలా ఉండాలనే అంశాలను ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ వివరించారు.
సైబర్‌నేరాల దర్యాప్తులలో బ్యాంకుల నుంచి ఎదురవుతున్న సమస్యలు, వేగంగా సమాచారం బ్యాంకుల నుంచి రాకపోవడం, బాధితులకు రిఫండ్, అకౌంట్స్ స్టేట్మెం ట్, నిబంధనలు పాటించకుండా కరెంట్ ఖాతాలు, ఫ్రాడ్ స్టార్స్ నిర్వహించే మూల్ అకౌంట్స్, సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, షెల్ కంపెనీ పేరుతో ఖాతాలు తెరవడం, పీపీఎన్ఎస్ ద్వారా లావాదేవీలు నిర్వహించడం వంటి సమస్యలను సీపీ బ్యాంకు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను అధిగమించడానికి సైబర్ క్రైమ్ యూనిట్ తయారు చేసిన జియో బెస్డ్ అ కౌంట్స్ వెరిఫికేషన్, రియల్ టైమ్ మానిటరింగ్, మల్టీ ఫ్యాక్టర్ అథింటికేషన్, ప్రొటోకాల్స్ సూచనలు చేశారు.
ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పట్నాయక్, ఆర్బీఐ జనరల్ మేనేజర్ రుచి అస్తానాలు ఆయా అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంతో సైబర్నేరాలను అరికట్టేందుకు కావాల్సిన చర్యలు, పోలీసుల సూచనలతో మరింత పకడ్బందీగా సైబర్నేరాలను అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. బ్యాంకింగ్ సెక్టార్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య ఇలాంటి సమావేశాలు , వర్క్‌షాప్‌లు నెలకొకసారి నిర్వహించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్ డీసీపీ, ఏసీపీ, లీగల్ అడ్వైజర్లు, ఆయా బ్యాంకుల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పా టు చేశారు. ఈ కమిటీ ఎస్ఓపీ తయారు చేసి సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు చేసేందుకు ఉపయోగపడుతుందని నగర పోలీస్ కమిషనర్‌తో పాటు, బ్యాంకు అధికారులు అభిప్రాయపడ్డారు.