Hyderabad | బంజారాహిల్స్,జూన్ 14: నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని గంజాయి సేవిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్ నగర్లో నివసించే సయ్యద్ ఇబ్రహీం(25) అనే యువకుడు ఫాల్ సీలింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. శుక్రవారం రాత్రి ఎన్బీటీ నగర్లోని మేయర్ నివాసం సమీపంలోని ఖాళీ స్థలంలో సయ్యద్ ఇబ్రహీం మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకొని ఇబ్రహీంను రెడ్ హ్యాండెగా పట్టుకున్నారు. అతడిని సోదా చేయగా ఐదు గ్రాముల గంజాయి లభించింది. ఈ మేరకు ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.