Hyderabad | వెంగళరావునగర్, ఫిబ్రవరి 20: ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో కామాంధుడు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న బాలిక(17) కాలేజ్ కు రాలేదని అధ్యాపకురాలి నుంచి బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.
ఆలస్యంగా ఇంటికొచ్చిన బాలికను నిలదీయగా రహ్మత్ నగర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ సాయి కుమార్(23)తో ట్యాంక్ బండ్‌కు వెళ్లానని అంగీకరించింది. గతంలో సాయి కుమార్ మూడు సార్లు బాలిక ఇంటికెళ్లి గడిపి వచ్చాడు. గతేడాది డిసెంబర్లో ప్రపోజ్ చేసినట్టు, బాలిక తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందేటప్పుడు బుధవారం రాత్రి నేరుగా బాలిక ఇంట్లోనే గడిపేసి వెళ్లినట్టు తెలిపారు.
ఇంట్లో ని ఒకటో ఫ్లోర్లో ఉండేటప్పుడు శారీరకంగా కలుసుకున్నట్లు బా లిక చెప్పింది. మాయమాటలతో మభ్యపెట్టి తన కుమార్తె జీవితం తో చెలగాటమాడిన సాయి కుమార్‌పై చర్యలు తీ సుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.