హైదరాబాద్ : నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను కిందకు దింపి, తనిఖీలు చేపట్టారు.
కానీ బాంబు లభ్యం కాలేదు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు.