Hyderabad | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోరం జరిగింది. ఇంటి ముందు కూర్చున్న ఇద్దరు విద్యార్థులపై దుండగులు కర్రలతో దాడి చేశారు.
కాలనీల్లో వేగంగా కార్లు నడుపుతున్నారని ప్రశ్నించినందుకు ఆగ్రహానికి గురైన వారు.. విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దుండగుల దాడిలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.