హైదరాబాద్ : మల్కాజిగిరిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భర్తను భార్య తుపాకితో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే..అరుణ్, నిషారాణి భార్య భర్తలు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అరుణ్ మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె సొంత చెల్లెలు నిషారాణిని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున మాట్లాడుకుందామని పిలిచిన అరుణ్ నిషారాణిని మరో వ్యక్తి సహాయంతో కిరాతకంగా కాల్చి చంపి పారిపోయాడు.
నిందితుడు గతంలో ఓ కేసులో అరెస్ట్ అయి మార్చి నెలలో బెయిల్ మీద బయటికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రాణహాని ఉందని కోడలిని ఇంటికి పంపిస్తే గొడవ చేసి పిలిపించి మరీ తన కొడుకే కోడలిని హత్య చేశాడని అరుణ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పరారీలో ఉన్న అరుణ్ కోసం పోలీసుల గాలిస్తున్నారు.