హైదరాబాద్ : భార్య వేధింపులు తాల లేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేరేడ్మెట్ (Neredmet) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేరేడ్మెట్ లక్ష్మీ నగర్లో నివసించే శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సొంతూరు. 2013లో సట్టపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం భర్త ప్రోత్సాహంతో ఆమె ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్లో చేరింది.
ఉద్యోగం వచ్చాక భర్తను దూరం పెడుతూ శ్రీనివాస్ కుటుంబంపై వరకట్న వేధింపులు, విడాకుల కేసు పెట్టింది. నాలుగు నెలలుగా భార్యతో దూరం ఉంటూ జీవిస్తున్నాడు శ్రీనివాస్. ఆమె పెట్టిన కేసుల వల్ల ఆవేదన గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడు శివకృష్ణ శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.