Hyderabad | కేపీహెచ్‌బీ కాలనీ, మే 15: ఓ యువతిని వన్‌సైడ్ లవ్ చేశాడు… పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులను బంధువులతో అడిగించాడు.. వారు నిరాకరించి.. యువతికి ఆరో యువకుడితో పెండ్లి జరిపించారు. దీనిపై కక్షపెంచుకున్న లవర్.. 8 ఏండ్ల తర్వాత ప్రియురాలి భర్త గుండెల్లో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు…చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యకేసు వివరాలను గురువా రం బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రాజశేఖర్‌రెడ్డిలతో కలిసి వెల్లడించారు. ఏపీ, కాకినాడకు చెందిన పంపేన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ (27) 9వ తరగతి చదివాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మేనత్త ఇంటిదగ్గర పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయి ని వన్‌సైడ్ లవ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను బంధువులతో అడిగిపించాడు.
అతని చెడు ప్రవర్తన కా రణంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొద్ది రోజులకు రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెం దిన కాళ్ల వెంకటరమణ(32)కు శ్రావణ సంధ్యను ఇచ్చి వివాహం జరిపించారు. ఈ కుటుంబం కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్ ఫేస్-1లో నివాసం ఉంటున్నారు. కాగా ..ఇటీవల తన సోదరితో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వెళ్ళగా…అక్కడ పవన్‌కు కనిపించింది. ఏలాగైనా అమ్మాయిని దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని ప్రణాళిక సిద్ధం చేసుకుని.. కేపీహెచ్‌బీకాలనీలో యువతి నివసించే ఇంటికి సమీపంలోకి మకాం మార్చాడు. తరచుగా వెంకటరమణ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగు తూ… ఇబ్బంది పెట్టేవాడు.
ఇంటి ముం దు బైక్ పార్క్ చేయడం, అడిగితే దుర్భాషలాడడం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 10న అర్ధరాత్రి… వెంకటరమణ తన తోటి అల్లుడు దుర్గాప్రసాద్ ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా… పవన్ వచ్చి గొడవ మొదలు పెట్టాడు. పవన్‌తో స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్ (19), నంబిగారి సాయికుమార్ (20), మరో బాలుడు ఉన్నారు. ఈ క్రమంలో వెంకటరమణతో వాగ్వాదానికి దిగిన పవన్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతని గుండెల్లో పొడిచాడు. కొద్ది క్షణాల్లోని వెంకటరమణ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మరునాడు నిందితులైన గుబ్బల శివరామకృష్ణ , అనిల్, సాయికుమార్, మరో బాలుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో పవన్‌ను గురువారం అరెస్ట్‌చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు బృందాన్ని డీసీపీ అభినందించారు.