Fire Accident | సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ బ్యాంకు ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అది కాస్త భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కీలక దస్త్రాలు దగ్ధమవుతున్నాయని తెలుస్తోంది.
ఫైర్ యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో మంటలార్పడం కష్టమవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఆ భవనంలో ఎవరైనా ఉన్నారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.