Ganja Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. రూ.40కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి ఈ గంజాయిని పట్టుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయిని బ్యాంకాక్‌లో కొన్నట్లు మహిళ అధికారులు తెలిపినట్లు సమాచారం. విమానంలో తరలిస్తే ఎవరికీ అనుమానం రాదని భావించినట్లు సదరు మహిళ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. థాయ్‌లాండ్, భారత్ మధ్య డ్రగ్స్ సిండికేట్‌పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నారు. భారత్‌లో హైడ్రోఫోనిక్ గంజాయికి డిమాండ్ ఉండడంతో ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపింది.